Thursday, April 25, 2024
- Advertisement -

టెన్షన్.. టెన్షన్ గా గాంధీవన్ పటేల్‌నగర్‌.. కారణం అదేనా?

- Advertisement -

దేశంలో ఓ వైపు కరోనాతో నానా కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో గుంపులుగా ఉండకూడదు.. సోషల్ డిస్టెన్స్ ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నా కొన్ని చోట్ల అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా స్వల్ప విషయమై ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గానలివానగా మారింది. ఈ సంఘటన బేగంబగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తుండటం గమనించిన బస్తీ నివాసి సతీష్ రోడ్డుపై పిల్లలు ఆడుకుంటుంటారు బస్తీలో నుంచి వెళ్లేటప్పుడు వాహనం వేగాన్ని తగ్గించి వెళ్లాలని చెప్పడంతో ఆగ్రహించిన యువకుడు అతనితో వాగ్వాదానికి దిగాడు.

అక్కడి బస్తీ వాసులు అతనికి నచ్చజెప్పి పంపించారు. కానీ ఆ యువకుడు ఆగ్రహంతో కొద్దిసేపటి తర్వాత ఒక వర్గానికి చెందిన సుమారు 30 నుంచి 40 మందితో అక్కడికి చేరుకుని సతీష్‌తో పాటు అక్కడున్న వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో బస్తీవాసులు ప్రతి దాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వెంటనే భారీ ఎత్తున పోలీస్ పహారా ఏర్పాటు చేశారు.

పటేల్‌నగర్‌లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి బందోబస్తు చర్యలు చేపట్టడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఈ మేరకు పోలీసులు ఇరువర్గాలకు చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సెంట్రల్ జోన్ అదనపు సిపి విశ్వ ప్రసాద్ ఇన్‌స్పెక్టర్ మధుమోహన్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంపూ ‘క్యాలీఫ్ల‌వ‌ర్’ టీజర్ రిలీజ్

ఏపిలో కరోనా కల్లోలం.. 92 మంది మృత్యువాత!

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -