Saturday, May 3, 2025
- Advertisement -

ఇంటర్ పరీక్ష..మాట మార్చిన ఏపీ సర్కార్!

- Advertisement -

ఏపీ ఇంటర్ పరీక్షలపై గందరగోళం నెలకొంది. ఉదయం ఒక ప్రకటన ఇచ్చి మధ్యాహ్నం మాట మార్చింది ప్రభుత్వం. ఉదయం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

మధ్యాహ్నం ఇంటర్ ఫస్టియర్ పరీక్షల తొలగింపుపై ఇంకా నిర్ణయం తీసుకోని ఏపీ ఇంటర్ బోర్డు అంటూ మరో ప్రకటన వెలువరించింది.

విద్యా సంస్కరణల్లో భాగంగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగించాలని ప్రతిపాదనలు పంపామన్నారు.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం అబద్ధం. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగింది. ప్రజలు తమ సూచనలను జనవరి 26, 2025 లోపు [email protected] కు మెయిల్ చేయాలి. ప్రతిపాదిత సంస్కరణల విధానాలు http://bieap.gov.in అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. కాబట్టి ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దు అని కోరింది ఇంటర్ బోర్డు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -