విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని గుర్ల గ్రామంలో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్…రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. రక్షిత మంచి నీటి పథకం పంపింగ్ హౌస్ పరిశీలించిన పవన్..నీటి శుద్ధి ప్రక్రియ, రక్షిత మంచినీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు.అయితే పవన్ పర్యటన హడావిడిగా సాగింది. అభిమానుల హడావిడి, పోలీసుల ఓవర్ యాక్షన్ తో ముగిసింది పవన్ పర్యటన.
లోకల్ ఎమ్మెల్యేలకు కూడా సెక్యూరిటీ కల్పించలేకపోయింది జిల్లా పోలీస్ యంత్రాంగం. చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, ఎస్.కోట ఎమ్మెల్యేలను పక్కకు నెట్టేశారు పోలీసులు. అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను సైతం లెక్క చేయలేదు పోలీసులు. దీంతో పోలీసుల తీరును అంతా తప్పుబడుతున్నారు.
ఇక పవన్ తన పర్యటన సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నీటి శుద్ధి విషయంలో జాగ్రత్తలు పాటించాలని …పాతకాలంనాటి ఫిల్టర్ బెడ్లు, మంచి నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, వాటికి అవసరమైన మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.నీటి కాలుష్యాన్ని గల కారణాలు తెలుసుకోవాలని, దాని నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు చెప్పారు. తాగునీటి కాలుష్యానికి గల కారణాలను నివేదిక రూపంలో తెలియజేయాలని ఆదేశించారు.