Friday, May 2, 2025
- Advertisement -

గులాబీ సంరంభం…25 ఏళ్లు ఎన్నో మైలురాళ్లు!

- Advertisement -

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా గులాబీ పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు. ఈ రెండున్నర దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు, ఆటుపోట్లను ఎదుర్కొంది. కానీ తాను అనుకున్న లక్ష్యం ప్రత్యేక తెలంగాణను సాధించి చూపించారు కేసీఆర్. ఈ ప్రయాణంలో కేసీఆర్‌పై వచ్చినన్ని తిట్లు దేశంలో ఏ రాజకీయ నాయకుడిపై కూడా రాలేదు. కానీ ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.

2001.. ఏప్రిల్‌ 27.. హైదరాబాద్‌లోని జలదృశ్యం వేదికగా చరిత్రకు నాంది పలికారు కేసీఆర్. నీళ్లు.. నిధులు.. నియామకాలు అనే నినాదంతో ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లగలిగారు. తొలి అడుగులోనే రాష్ట్రంలోని మెజార్టీ స్థానిక సంస్థలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 54 సీట్లలో 26 గెలిచారు.

బీఆర్ఎస్ రెండు ఎంపీ స్థానాల్లో గెలవగా కేసీఆర్‌, ఆలె నరేంద్ర కేంద్రమంత్రులయ్యారు. తర్వాత యూపీఏ ప్రభుత్వం నాన్చుడు ధోరణికి విసిగి ఆ పదవులకు రాజీనామా చేశారు. 2008 ఉప ఎన్నికల్లో 16 స్థానాల్లో 7 సీట్లు, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా 45 స్థానాల్లో 10 మాత్రమే గెలుచుకుంది బీఆర్ఎస్‌.

2009లో కేసీఆర్‌ తెలంగాణ కోసం చేసిన ఆమరణ నిరాహారదీక్ష ప్రత్యేక తెలంగాణకు కారణమైంది. . కేసీఆర్‌ 11 రోజులు నిరవధికంగా దీక్ష చేయడంతో కేంద్రం దిగొచ్చి డిసెంబర్‌ 9న తెలంగాణపై ప్రకటన చేసింది. ఆ తర్వాత కేంద్రం యూ టర్న్ తీసుకోవడంతో మిలియన్‌ మార్చ్‌, సకల జనుల సమ్మె, విద్యార్థుల ఆందోళనలు మొత్తం తెలంగాణ సమాజం కదలిరావడంతో చివరికి 2014 ఫిబ్రవరి 14న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. జూన్‌ 2న నూతన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

ఆ తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పోటీ చేసి ప్రభంజనం సృష్టించింది. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి 63 సీట్లు దక్కించుకుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్‌. రైతుబంధు, రైతు రుణమాఫీ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, రైతు బీమా, దళిత బంధు అమలు చేశారు. రెండోసారి 83 సీట్లతో తిరుగులేని పార్టీగా ఆవిర్భవించింది బీఆర్ఎస్. 2018 డిసెంబర్‌ 13న కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -