Saturday, May 3, 2025
- Advertisement -

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షం

- Advertisement -

ఓ వైపు విపరీతమైన ఎండలు.. మరోవైపు వానలు, తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. నేటి నుంచి మరో నాలుగు రోజులు తెలంగాణలో ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

చక్రవాతపు ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. తూర్పు, దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ.

దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి బెంగాల్ వరకు వ్యాపించిన ఉపరితల ద్రోణి, అదే ప్రాంతం నుంచి కర్ణాటక దాకా ఏర్పడిన మరో ద్రోణి ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, రోడ్లపై నీరు నిలిచే పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -