Monday, May 5, 2025
- Advertisement -

నా పోరాటం ఫలించింది….న్యాయం గెలిచింది!

- Advertisement -

నా పోరాటం ఫలించింది…న్యాయం గెలిచందన్నారు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్…ఇన్నేళ్లుగా నేను చేసిన న్యాయ పోరాటానికి సహకరించిన నా ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు అన్నారు.

కోర్టును తప్పుదోవ పట్టించినందుకు చెన్నమనేని రమేష్ పై చర్యలు తీసుకోవలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతాను అన్నారు. నా ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.

పౌరసత్వం కేసులో చెన్నమనేని రమేష్ విచారణను తప్పుదోవ పట్టించారని కోర్టు సీరియస్ అయింది. ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడిగానే చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యేగా గెలిచారని వెల్లడించింది. రూ. 30 లక్షల ఫైన్‌ విధించింది న్యాయస్థానం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -