వైసీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. మీడియాతో మాట్లాడిన ఆయన… 4 నెలలకోసం బడ్జెట్ ప్రవేశ పెడుతోంది బడాయి ప్రభుత్వం వాళ్ళు గొప్పలు చెప్పినట్టుగా బడ్జెట్ కేటాయింపులు మాత్రం లేవు అన్నారు. మోసం చేయడానికి ప్రతిసారి ఒక కొత్త పదంతో వస్తాడు చంద్రబాబు ఈసారి నాలెడ్జ్ ఎకానమీ అనే పదం వాడుతున్నాడు చంద్రబాబు నాలెడ్జ్ ఎకానమీలో విద్యకు స్థానం లేదా? తల్లికి వందనం కోసం రూ.13000 కోట్లు కావాల్సి ఉంటే కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించి సూపర్ సిక్స్ హామీ నెరవేర్చాం అని చెప్పుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు.
గత ఐదేళ్లలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 డీఎస్సీ పోస్టులు భర్తీ చేసిందన్నారు. గత ప్రభుత్వాలు చేసిన అవకతవకలు సరిచేసి, కోర్టు కేసులు పరిష్కరించి పోస్టింగులు ఇచ్చిందన్నారు. 6,100 పోస్టులకు నోటిఫికేషన్ కూడా ఇచ్చాం మొత్తంగా 21,000 వేల టీచర్ పోస్టుల భర్తీ వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు పాఠాలు నేర్చుకోవడం లేదు ప్రపంచ స్థాయి రాజధాని అని అవే మాటలు.. 15,000 కోట్లు అప్పు అమరావతి కోసం చేస్తున్నారు అన్నారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. ఇవి చాలదని రాయలసీమకు వచ్చిన వాటిని కూడా అమరావతికి తరలించడం సమంజసం కాదు అన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం శ్రీకృష్ణ కమిషన్, శివరామకృష్ణన్ కమిటీ చెప్పినవాటి అమలుకు పూనుకోవాలన్నారు.