Saturday, May 3, 2025
- Advertisement -

ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్!

- Advertisement -

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు.. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు… ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై దీక్ష చేపట్టారు కవిత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కాదు.. అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోంది… అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదు అన్నారు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్.. అనుముల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణనను తప్పదోవ పట్టించి బీసీకు అన్యాయం చేస్తున్నారు అన్నారు. అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారంటా చెప్పాలన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్ సైట్ లో పెట్టాము… మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదు ? చెప్పాలన్నారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదు.. తెలంగాణలో చేసిన కులగణన వివరాలను వెల్లడించలేదు అన్నారు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది కాబట్టి ఆ పార్టీపై ఒత్తిడి చేయాలి… కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో మేము కూడా కలిసి వస్తాం కానీ కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయము అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -