Saturday, May 3, 2025
- Advertisement -

మోడీ 3.0..తెలుగు రాష్ట్రాల నుండి 5గురు!

- Advertisement -

ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు నరేంద్ర మోడీ. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7.15 గంటలకు మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారం ఉండనుంది.

ఐదుగురు అంతకుమించి ఎంపీలు ఉన్న పార్టీలకు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి. రెండు, మూడు ఎంపీలు వున్నవారికి ఒక సహాయ మంత్రి పదవి కేటాయించారు. రక్షణ, హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు సహా విద్య, సాంస్కృతిక శాఖలు బిజేపీ ఎంపీల‌కే ద‌క్క‌నున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల నుండి 5గురికి కేబినెట్‌లో చోటు దక్కింది. తెలంగాణ నుండి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం దక్కగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అవకాశం దక్కించుకున్నారు. ఇక ఏపీ నుండి కేంద్ర మంత్రిగా శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు, స‌హాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ల‌కు అవ‌కాశం ద‌క్కింది. ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మకు ఛానస్ దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -