వైనాట్ 175 లక్ష్యంగా దూసుకుపోతోంది వైసీపీ. ఇప్పటికే భీమిలి సభలో ఉత్తరాంద్ర వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేయగా భారీగా ప్రజలు తరలివచ్చారు. జగన్ మార్క్ స్పీచ్‌తో వైసీపీ కార్యకర్తల్లో జోష్ నింపగా టీడీపీ అండ్ కో గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు జగన్. ఇక తాజాగా ఇవాళ దెందులూరు సిద్ధం సభకు సర్వం సిద్ధమైంది.
దారులన్నీ సిద్ధం సభకు అనేలా వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఈ సభ ద్వారా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. 175 సీట్లు ఎలా గెలవాలో కార్యకర్తలకు వివరించనున్నారు. సభా ప్రాంగణాన్ని 110 ఎకరాల్లో ఏర్పాటు చేయగా పార్కింగ్ కోసం ప్రత్యేకంగా 150 ఎకరాలను ఏర్పాటు చేశారు. దెందలూరుకు వచ్చే దారులన్నీ వైసీపీ ఫ్లెక్సీలతో నిండిపోయాయి.
ఇక ఈ సభకు దాదాపు నాలుగు లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా. సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దగ్గరగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్ వే ఏర్పాటు చేశారు. ఇక ఈ సభ ద్వారా అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నామో కార్యకర్తలకు వివరించనున్నారు. అలాగే ప్రభుత్వ ప్రొగ్రెస్ రిపోర్టును కార్యకర్తలకు వివరించనున్నారు.