Sunday, May 4, 2025
- Advertisement -

బిగ్ ట్విస్ట్..చివరి రోజు బన్ని ఎన్నికల ప్రచారం

- Advertisement -

ఎన్నికల ప్రచార మరికొద్ది గంటల్లో ముగియనుందనగా బిగ్ ట్విస్ట్.నంద్యాల శాసనసభ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బన్నీ. హైదరాబాద్ నుండి గంటల ప్రయాణం చేసి మరి వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు.

అల్లు అర్జున్ రాకతో ఎమ్మెల్యే శిల్పారవి నివాసం దగ్గర భారీ జనసందోహం నెలకొంది. వేలాదిగా ప్రజలు తరలిరాగా తమ అభిమాన నటుడిని చూసి ఆనందం వ్యక్తం చేశారు. రవిచంద్రారెడ్డిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు బన్నీ.

నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.. అల్లుఅర్జున్ దంపతులకు క్లోజ్ ఫ్రెండ్. 2019 ఎన్నికల్లోనూ రవిచంద్రారెడ్డికి బెస్ట్ విషెస్ తెలిపారు. తాజాగా ఏకంగా బన్నీ ప్రచారానికి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -