ఏపీ అసెంబ్లీ ఎన్నికలు తెచ్చి తంటా మెగా ఫ్యామిలీ చీలిక వరకు వచ్చిన సంగతి తెలిసిందే.గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు బన్నీ. ఆ తర్వాత దీనిని నాగబాబు ఆజ్యం పోయడం, ఆ తర్వాత బన్నీ మరింత రెచ్చిపోయేలా కామెంట్ చేయడంతో మెగా ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరాయని ప్రచారం జరిగింది.
సీన్ కట్ చేస్తే ఇవాళ పవన్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారగా ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ మధ్య దూరం తగ్గుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్‌కు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు. కళ్యాణ్ బాబు…ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం అన్నారు చిరు. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడన్నారు.
రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉందన్నారు చిరు.