తిరుమల మొత్తం ఘటనకు ఇద్దరు పోలీసు అధికారులను బాధ్యులు చేస్తూ సస్పెండ్ చేశారు అన్నారు మాజీ మంత్రి అంబటి రాబాబు. బాధితులను జగన్ పరామర్శించకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డుకోవలని ప్రయత్నించారు కానీ జగన్ నడిచి వెళ్లి మరీ బాధితులకు భరోసా ఇచ్చారు అన్నారు.
అవినీతి, డ్రగ్స్, మాఫియా..దందాల్లో ఆరితేరినవాళ్ళను తిరుమలలో కూర్చోబెట్టిన సీఎం చంద్రబాబు ఈ ఘోరానికి కారణం అయ్యారు అని మండిపడ్డారు . పాపాత్ములకు దైవసన్నిధిలో ప్రధాన పాత్ర కల్పించి పేద ప్రజలను బలికొన్నారు. ఈ పాపం ఊరికే వదలదు అన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఎస్పీని బదిలీ చేయడం ఒక్కటే పరిష్కారం కాదు అన్నారు. ఈవో మీద, ఛైర్మన్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? గత ప్రభుత్వంలోని టీటీడీ పాలకమండలిపై ఆరోపణలు చేసింది కూటమి ప్రభుత్వం. క్రైమ్స్ మేనిఫెక్చర్ చేసి అరెస్టులు చేయాలని కుట్ర పన్నుతున్నారు అన్నారు.
ఈ ఘటనకు బాధ్యత వహించాల్సింది ఛైర్మన్, ఈవో, జేఈవోలే అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు. కానీ చంద్రబాబు
వారిమీద చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు హుటాహుటిన వెళ్లింది మృతుల కుటుంబాల పరామర్శకు కాదు, తన క్రైమ్ మేనిఫెక్చరింగ్ టీమ్‌ను కాపాడేందుకు వచ్చాడు అని మండిపడ్డారు రాంబాబు.