ట్రోల్స్‌తో ఇబ్బందిపెడితే భయపడి వెళ్లిపోతుందిలే అనుకున్నారా? అని ప్రశ్నించారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. మీడియాతో మాట్లాడిన శ్యామల..ఇప్పటికే మీకు చేతనైనంత చేశారు.. ఇండస్ట్రీలో ఉపాధి లేకుండా చేశారు అయినా నేను వెనక్కి తగ్గను.. నిలబడి పోరాడతా అని తేల్చిచెప్పారు.
పిఠాపురంలో ఓ టీడీపీ నాయకుడు ఓ దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడితే.. పోలీసులు అతడ్ని రక్షించేందుకు విశ్వప్రయత్నం చేశారు అని ఆరోపించారు శ్యామల. చివరికి బాలిక కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకురావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేశారు అని మండిపడ్డారు.
మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో జానీలు రెచ్చిపోతున్నారంటూ కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడాడు. బాలికను ఆటోలో ఎక్కించుకుని ఊరు శివారుకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక అపరస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా స్థానికులు జాన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జాన్ భార్య దుర్గాడ విజయలక్ష్మి టీడీపీ మాజీ కౌన్సిలర్.