Wednesday, May 7, 2025
- Advertisement -

మరో పథకం పేరు మార్పు..ఈసారి ఏంటో తెలుసా!

- Advertisement -

వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాల పేర్ల మార్పే లక్ష్యంగా పనిచేస్తోంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే గతంలో మాజీ సీఎం జగన్‌ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాల పేర్లను మార్చారు చంద్రబాబు.

అమ్మ ఒడికి తల్లికి వందనం, జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, జగనన్న గోరుముద్దకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, నాడు-నేడుకు మన బడి- మన భవిష్యత్‌గా మార్చింది. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సామాజిక భద్రత పింఛన్లకు ఎన్టీఆర్ పేరు పెట్టింది.

తాజాగా మరో పథకం పేరు మారింది. జగన్ ప్రభుత్వంలో అమలులో ఉన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం పేరును ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్టుగా పేరు మార్చింది చంద్రబాబు ప్రభుత్వం.ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. భూముల సమగ్ర రీసర్వే కోసం ఉద్దేశించిన పథకం ఇది. అత్యంత ఆధునిక పద్ధతిలో,అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమగ్ర భూ సర్వే అమలులోకి వచ్చింది. భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా గ్రామ సచివాలయాల్లోనే చేపట్టింది. దీని పేరును ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్టుగా మార్చారు చంద్రబాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -