Saturday, May 3, 2025
- Advertisement -

కష్టాల్లో రైతులు… బాబు స్పందనేది?

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు వడ్డీ రఘురాం. రైతులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్న చంద్రబాబులో చలనం లేదని దుయ్యబట్టారు. గతంలో వైసీపీ హయాంలో జగన్ వారి పక్షాన నిలిచారన్నారు. మిర్చి , అరటి రైతులకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. జగన్ స్వయంగా తోటలకే వెళ్లి రైతులతో మాట్లాడారని, కష్టకాలంలో వారికి అండగా ఉన్నారని రఘురాం గుర్తుచేశారు. అదే సమయంలో రైతుల కోసం చంద్రబాబు ఏం చేస్తున్నాడు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత నుండి తప్పించుకునేందుకు ప్రభుత్వం అర్ధంలేని కారణాలు చెప్పడం సరికాదన్నారు. రైతులను సంక్షోభంలోకి నెట్టేలా ప్రభుత్వ విధానం ఉందదన్నారు. వెంటనే ఆక్వా రైతుల కోసం ప్రత్యేక ప్రాధికార సంస్థ ఏర్పాటు, మధ్యవర్తులను తొలగించాలని, ఫీడ్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ,

గతంలో వైసీపీ ప్రభుత్వం పన్నులు తగ్గించడం వంటి చర్యలు ఆక్వా రైతులకు గణనీయమైన లాభాలు చేకూర్చినట్లు తెలిపారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఆక్వా రైతుల పరిస్థితి తీవ్రంగా దిగజారిందని, వారి సమస్యలను ఎదుర్కొనడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు – పవన్ కళ్యాణ్‌లు కలిసి ప్రకటించిన రూ.200 ఫీడ్ ధర తగ్గింపు ఎందుకు అమలు కాలేదో చెప్పాలంటూ ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -