Sunday, May 4, 2025
- Advertisement -

టెంపుల్ సిటీలో ఏరులైపారనున్న మద్యం!

- Advertisement -

ఆధ్యాత్మిక సిటీలో ఏరులై పారనుంది మద్యం. పవిత్రమైన పుణ్యక్షేత్రాలకి నిలయమైన తిరుపతి జిల్లాకి రాష్ట్రంలోనే అత్యధికంగా 227 లిక్కర్ షాపులకు కేటాయించింది కూటమి ప్రభుత్వం. తిరుమల పవిత్రతని కాపాడతానని కబుర్లు చెప్పి తిరుపతి జిల్లాకి అత్యధిక మద్యం షాపుల్ని కేటాయించారు చంద్రబాబు. టెంపుల్ సిటీలో మద్యాన్ని ఏరులై పారించేందుకు రాష్ట్రంలోనే అత్యధిక షాపులను తిరుపతికి కేటాయించడంపై తిరుమల పవిత్రతని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారా అని మండిపడుతున్నారు ప్రజలు.

ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో తన మార్క్ పాలన సాగిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వ్యాపారం చేయాలనుకుంటే తమకు కప్పం కట్టాలని, లేకుంటే వ్యాపారం కష్టమే అని జేసీ ప్రభాకర్ రెడ్డి హుకుం జారీ చేశాడు. తమకు షేర్, కమీషన్లు ఇవ్వాల్సిందేనని …అప్పులు చేసి షాప్ దక్కించుకుంటే రాబందుల్లా వీళ్ళు వాలిపోతున్నారు అని వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు.

మద్యం,ఇసుక వ్యాపారాల్లో 15 శాతం కమీషన్, 20 వాతం వాటాకు హుకుం జారీ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నా కొ..ల్లారా..అందర్నీ కాల్చి పార..అంటూ పచ్చి బూతులు మాట్లాడారు జేసీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -