- Advertisement -
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన ఉప సంహరణ ఉండనుంది. డిసెంబర్ 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదేరోజు లెక్కింపు ఉండనుంది.
వైసీపీ నుండి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. వెంకటరమణ, బీద మస్తాన్‌రావు ..ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరగా కృష్ణయ్య తటస్థంగా ఉన్నారు.