ఏపీలో ఇంటర్ ఫలితాలు రిలీజ్ కాగా పదో తరగతి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది విద్యాశాఖ. ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగగా పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి 5,64,064 మంది, తెలుగు మీడియాంకు సంబంధించి 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఇప్పటికే వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నెల 23వ తేదీన పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారు. ఫలితాలను https://www.bse.ap.gov.in లేదా మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి. తర్వాత సెలెక్ట్ సర్వీస్ లో విద్యా సేవలు ఎంచుకోవాలి. తర్వాత డౌన్లోడ్ ఏపీ SSC ఫలితాలు- 2025 ఆప్షన్ పై క్లిక్ చేయాలి. పీడీఎఫ్ రూపంలో రిజల్ట్స్ కనిపిస్తాయి.