బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా తాజాగా వాతావరణ శాఖ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అల్పతీడనం తుఫానుగా ఏర్పడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని…రెండు రోజుల్లో అల్పపీడనంపై ఖచ్చితమైన సమాచారం వస్తుందన్న విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో 30 మంది చనిపోయారు. భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తలరించారు.
ఇప్పటి వరకు 100కు పైగా రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబుతో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కేంద్రం నుండి అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.