ఏపీ కేబినెట్ భేటీ ఇవాళ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అందులో ప్రధానంగా అవ్వా,తాతలతో పాటు వితంతు, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతి వృత్తిదారులకు పింఛన్ పెరగనుంది. ప్రతినెలా వీరికి పింఛను మొత్తాన్ని రూ.3,000కు పెంచున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ కేబినెట్ ముందుకు రానుండగా దానికి అమోదం తెలపనున్నారు.
2024 జనవరి నుంచి పింఛన్ మొత్తాన్ని రూ.3,000కు పెంచనున్నట్లు గతంలోనే ప్రకటించారు సీఎం జగన్. అందుకు తగ్గట్టుగానే నిర్ఱయం తీసుకోనుండగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అలాగే మిచౌంగ్ తుఫాన్‌తో పాటుగా చేయూత, ఆసరా,పలు పథకాలకు నిధుల్ని విడుదల చేయనున్నారు.
దీంతో పాటు ఇంటింటికీ మంచినీటి కుళాయిలకు సంబంధించిన అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. తుఫాన్ సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలపై చర్చింనున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.