Sunday, May 4, 2025
- Advertisement -

ముంచుకొస్తున్న మరో ముప్పు.. భయం గుప్పిట్లో ప్రజలు!

- Advertisement -

ఎడతెరపిలేని వర్షాలు ఏపీని ముంచెత్తాయి. ప్రధానంగా విజయవాడ భారీ వర్షాల ధాటికి అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం నుండి కొలుకుంటుండగా మరో ముప్పు పొంచి ఉందన్న వార్త ప్రజలను భయాందోనకు గురిచేస్తోంది.

ఈనెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశంఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇది తుపానుగా మారి విశాఖ – ఒడిశా దిశగా ప్రయణించి తీరందాటే అవకాశం ఉందని చెప్పగా దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో 19 మంది మృతి చెందగా ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని, పంటలు నాశనం అయ్యాయని తెలిపారు అధికారులు. వరదల్లో ఉన్న బాధితులు సాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లకు కాల్ చేయాలని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, వరద ఉధృతి కారణంగా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -