Sunday, May 4, 2025
- Advertisement -

డిసెంబర్‌లోగా మెగా డీఎస్సీ!

- Advertisement -

దాదాపు 4 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు చేసిన 5 సంతకాలకు ఏపీ కేబినెట్ అమోదం తెలిపింది. అలాగే నిరుద్యోగులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీకి ఏపీ మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర‌కు తొలి నిర్ణ‌యంగా మెగా డీఎస్సీకి ఆమోదం తెల‌పాల‌ని చంద్రబాబు కోరగా మంత్రులంతా ఏకగ్రీవంగా అమోదం చెప్పారు. ఈ డిసెంబ‌రు నాటికి మెగా డీఎస్సీ పూర్తి చేయాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించింది. దీనికి సంబంధించిన విధివిధానాలు, నోటిఫికేష‌న్ వంటివాటిని కూడా త్వ‌ర‌గా ఇవ్వాల‌ని పేర్కొంది.

మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను డిసెంబర్ 10లోపు భర్తీ చేయ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఇక ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైలుపైనే చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -