ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ షెడ్యూల్ ప్రకారం ఇవాళ జరగాల్సి ఉండగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ విహారయాత్రలో ఉండటంతో కేబినెట్ భేటీ రేపటికి వాయిదా పడింది. ఇక లోకేష్ కోసం కేబినెట్ సమావేశం వాయిదా పడటం ఇది రెండోసారి. ఇక అలాగే ఓ మంత్రి కోసం మంత్రివర్గ సమావేశం వాయిదా పడటం ఏపీ చరిత్రలోనే తొలిసారి. కేబినెట్ సమావేశం లోకేష్ కోసం వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది.
పేపర్‌లెస్‌గా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించేలా ప్లాన్ చేశారు చంద్రబాబు. షెడ్యూల్ ప్రకారం ఇవాథ ఉదయం 11 గంటలకు వెలగపూడి రాష్ట్ర సచివాలయం భవనంలో మొదటి అంతస్తులో కేబినెట్ మీటింగ్ హాల్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే లోకేష్ టూర్‌లో ఉండటంతో కేబినెట్ మీట్ రేపటికి పోస్ట్ పోన్ అయింది.
లోకేష్ కోసం కేబినెట్ భేటీ వాయిదా పడటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ నడుస్తోందని, ప్రతీకార రాజకీయాలు సరికావని పలువురు సూచిస్తున్నారు.