ఏపీ సీఎంగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. ఎన్నికల్లో గెలుపుకోసం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటి అమలుకు నానా తంటాలు పడుతున్నారు. ఇక ప్రస్తుతం దావోస్‌లో ఉన్న చంద్రబాబు.. ఓ అంతర్జాతీయ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యారు.
మోదీ కేబినెట్‌లో ఎప్పుడు చేరుతారు అని బ్లూమ్ బర్గ్ ప్రతినిధి ప్రశ్నించారు. అయితే తొలుత ఈ ప్రశ్నకు చంద్రబాబు ఆశ్చర్యపోయారు. కాసేపటి తర్వాత తనకు ఎలాంటి లక్ష్యాలు లేవని… ఏపీలో ఉంటానని చెప్పుకొచ్చారు. ఏపీని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు.
ఆ విలేకరి అంతటితో ఆగకుండా ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే కేంద్ర కేబినెట్‌లోకి రావాలని ఆహ్వానిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని చెప్పారు. బ్లూమ్ బర్గ్ ప్రతినిధి అడిగిన ఈ ప్రశ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.