Sunday, May 4, 2025
- Advertisement -

2024… జగనన్న వన్స్ మోర్

- Advertisement -

రాష్ట్రంలో 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ కాబోతున్నాయి. సీఎం వైయస్ జగన్ ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి విషయంలో జగన్ చేపట్టిన సంస్కరణలు ఆయన్ను తిరుగులేని నాయకుడిగా మరోసారి నిలుపుతున్నాయి.

అందుకే ఎన్నికల సందర్భంగా వివిధ సర్వే సంస్థలు విడుదల చేస్తున్న అంచనాలన్నింటిలోనూ వైయస్ఆర్‌సీపీదే విజయమని తేల్చి చెబుతున్నాయి.ఒకటా రెండా.. ఏకంగా 10కి పైగా సర్వే సంస్థల అంచనాల్లోనూ మళ్ళీ ఫ్యాన్ గుర్తు ప్రభంజనం సృష్టిస్తుందని చెబుతున్నాయి. 2019లో రాయలసీమలో సాధించిన సీట్లను రిపీట్ చేయడం ఖాయమని.. కోస్తాలోనూ వైసీపీ పట్టు నిలుపుకుంటుందని విశ్లేషకుల అంచనా.

వైయస్ఆర్‌సీపీ దాదాపు 120 – 130 అసెంబ్లీ సీట్లు, 20 – 21 ఎంపీ సీట్లు సాధిస్తుందని సర్వే సంస్థలతోపాటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టైమ్స్ నౌ, చాణ్యక్య గ్రూప్ ఆత్మసాక్షి, జన్మత్ పోల్స్, పోల్ స్ట్రాజటీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్ లాంటి సంస్థలన్నీ జగన్‌దే విజయం అని తేల్చి చెప్పాయి.
నిజానికి గత మూడు నెలలుగా సీఎం వైయస్ జగన్ సిద్ధం సభలు, మేమంతా సిద్ధం యాత్ర, ఇప్పుడు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.

నియోజకవర్గాల్లో క్యాడర్ బలంగా ఉండడంతోబాటు సీఎం వైయస్ జగన్ అమలు చేసిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల నుంచి కూడా మద్దతు అంతే స్థాయిలో వస్తోంది. ముఖ్యంగా మహిళలు, పింఛన్ లబ్ధిదారుల నుంచి జగన్‌కు భారీ మద్దతు లభిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఆది నుంచే సయోధ్య కుదరడం లేదు. అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచి.. సీట్ల పంపకాలు, మేనిఫెస్టో ప్రకటన వరకు అంతా అయోమయం, గందరగోళం. దీంతో జనం వారిని నమ్మడం లేదు.

కూటమి మేనిఫెస్టోను చూసిన ప్రజలు ఇది ఆమలు సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం వైయస్ జగన్ అమలు సాధ్యమైయ్యే హామీలే ఇచ్చానంటూ ధీమాగా ఎన్నికలకు వెళ్లడం కూడా కలిసి వస్తోంది.దీనికి తోడు వాలంటీర్లను దూరం పెట్టడం, పెన్షన్లు ఇంటి దగ్గర అందకుండా కుట్ర చేయడంలాంటి చర్యలు టీడీపీ కూటమిపై ప్రజలకు మరింత ఆగ్రహానికి గురిచేశాయి. మొత్తం మీద ఈసారి కూడా వైయస్ఆర్‌సీపీదే విజయమన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -