Sunday, May 4, 2025
- Advertisement -

ఢిల్లీకి జగన్‌..సర్వత్రా ఉత్కంఠ!

- Advertisement -

ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు. వచ్చేవారం జగన్ హస్తిన పర్యటన ఉండనుండగా కేంద్ర పెద్దల అపాయింట్మెంట్లు ఖరారు కాగా రేపు జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. దాదాపు రెండు రోజుల పాటు జగన్ టూర్ ఉండనుండగా బాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలపై వివరించనున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు ఎపిసోడ్‌తో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉంది. హస్తిన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్ , హర్ దీప్ సింగ్ పూరీని కలిసే అవకాశం ఉంది.

వాస్తవానికి గత నెలలో జగన్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ అప్పుడు జగన్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. అయితే తాజాగా కేంద్ర పెద్దల అపాయింట్‌మెంట్ ఖరారు కాగా జగన్ ఢిల్లీకి వెళ్తున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.

25 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు చంద్రబాబు. ఓ వైపు టీడీపీ – జనసేన పొత్తు ఖరారు కాగా బీజేపీ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో జగన్‌తో బీజేపీ కలిసి వెళ్తుందా అనే చర్చ నడుస్తోంది. అలాగే ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రస్తావన నేపథ్యంలో జగన్‌ హస్తిన టూర్‌ పై అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -