Sunday, May 4, 2025
- Advertisement -

రైతన్నలకు జగనన్న గుడ్ న్యూస్..

- Advertisement -

రైతన్నలకు గుడ్ న్యూస్ అందించారు ఏపీ సీఎం జగన్. ఈ సంక్రాంతికి రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేస్తామని వెల్లడించారు. మిచౌంగ్ తుపానుతో పంట నష్టపోయిన ప్రాంతాలలో పర్యటించారు జగన్. పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచరాన్ని నమ్మ వద్దని కోరారు.

బాపట్ల జిల్లాలో పంటనష్ట పోయిన ప్రాంతాల్లో పర్యటించి వారిలో ధైర్యం నింపారు. తుపాను వల్ల నష్టపోయిన వారిని అన్ని విధాల ఆదుకుంటామని వారికి భరోసానిచ్చారు. దాదాపుగా 12 వేల మంది తుపాన్‌ కారణంగా నష్టపోయారని… ప్రతి ఇంటికీ రేషన్‌ సరుకులతో పాటుగా 2500 రూపాయల నగదును అందిస్తామని ప్రకటించారు.

ఇదే క్రమంలో టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వంలో కరువు వచ్చినా, వరద వచ్చినా పట్టించుకోలేదని…ప్రతి ఎకరాను కూడా ఈ–క్రాప్‌ చేసి.. నష్టపోయిన ప్రతి రైతుకూ ఇన్సూరెన్స్ అందిస్తామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో జాబితాను ప్రకటించి..మిస్ అయిన రైతులకు మళ్లీ నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -