Tuesday, April 23, 2024
- Advertisement -

వైఎస్ ఆర్ బాట‌లో జ‌గ‌న్‌…

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప‌రిపాల‌న‌లో త‌న తండ్రి దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ఆద‌ర్శంగా తీసుకుంటూ ముందుకు క‌దులుతున్నారు. మొద‌టి కేబినేట్ స‌మావేశంలోనె ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న జ‌గ‌న్ ఇప్పుడు మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను నేరుగా తెలుసుకొనేదానికి ప్రాద‌ర్బార్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన సీఎం కార్యాలయం అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు స‌మాచారం.

గ‌తంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూడా ఇదే రకంగా సామాన్యులు తనను కలుసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతి రోజు ఉదయం కొంతసేపు సామాన్యులను కలుసుకుని వారి సమస్యలు విన్న వైఎస్ఆర్… వాటికి పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించేవారు. ఆయ‌న త‌ర్వాత ఇలాంటి కార్య‌క్ర‌మాన్ని ఎవ‌రూ నిర్వ‌హించ‌లేదు.

ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌జాద‌ర్బార్ కార్య‌క్రమాన్ని నిర్వ‌హించ‌డానికి పూనుకున్నారు. ప్ర‌జాద‌ర్బార్‌లో ప్ర‌జ‌ల‌నుంచి అక్కడికక్కడే పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని సంబంధితత శాఖ అధికారులకు పంపుతారు. తాజాగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజు నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -