సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. జనసేన పార్టీ నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమించాలని లేఖలో కోరారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇద్దరిని విప్‌లుగా గుర్తించాలని పవన్ కళ్యాణ్…చంద్రబాబుకు లేఖరాశారని పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు.
ఇక ఇప్పటికే ఏపీ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పవన్‌తో పాటు నాదేండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు ప్రాతినిధ్యం దక్కింది. ఇక తాజాగా ఇద్దరు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి పేర్లనే విప్‌లుగా ప్రతిపాదించారు పవన్.
స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడిని నియమించగా విప్ పదవులను చంద్రబాబు నియమించాల్సి ఉంది. కేబినెట్‌లో ఛాన్స్ దక్కని వారికి విప్‌లుగా బాబు అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి 164 స్థానాలతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
