Sunday, May 4, 2025
- Advertisement -

టీడీపీనే ప్రారంభించింది..టీడీపీనే మూసేసింది!

- Advertisement -

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు గడుస్తుండగా సూపర్ సిక్స్ హామీలపై ఎటూ తేల్చలేకపోతున్నారు .దీనికి తోడు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు టీడీపీ నేతలు. రెడ్ బుక్ పేర ప్రతీకార రాజకీయాలు నడుస్తుండగా మరోవైపు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల పేర్లు మారుస్తూ శాడిజాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఇక తాజాగా శాప్‌ నెట్‌ ( సొసైటీ ఫర్‌ ఏపీ నెట్‌వర్క్‌)ను మూసివేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శాప్‌ నెట్‌కు సంబంధించిన సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఉన్నత విద్యామండలికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో విశేషం ఏంటంటే చేసింది. ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం శాప్‌ నెట్‌ను ఏర్పాటు చేసింది.

ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం శాప్‌నెట్‌ను అలాగే కొనసాగించింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం రాగా అనూహ్యంగా శాప్ నెట్‌ను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. శాప్‌ నెట్‌కు సంబంధించిన సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఉన్నత విద్యామండలికి బదిలీ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -