తెలంగాణ నుండి రిలీవ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రాపాలికి పోస్టింగ్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్రపాలి కాటాను ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీసీఎండీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా కూడా ఆమ్రపాలికి పూర్తి అదనపు బాధ్యతలను ఏపీ ప్రభుత్వం అప్పగించింది.
అలాగే పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ అయిన జి.వాణిమోహన్‌ను బదిలీ చేసి జీఏడీలో సర్వీసుల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది.కుటుంబ సంక్షేమశాఖ, ఆరోగ్య కమిషనర్‌గా వాకాటి కరుణ కూడా నియమితులుకాగా జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా వాకాటి కరుణకు అదనపు బాధ్యతలను అప్పగించింది.
కార్మికశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించగా, కార్మికశాఖ అదనపు బాధ్యతల నుంచి ఎం.ఎం.నాయక్‌ను రిలీవ్ చేసింది. తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్‌కు మాత్రం ఏపీ ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.