Sunday, May 4, 2025
- Advertisement -

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్…భేష్

- Advertisement -

ఏపీ ఎన్నికల వేళ తీవ్ర చర్చనీయాంశంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది నీతి అయోగ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెడుతూ…ఈ చట్టం ప్రయోజనాలు భేష్ అంటూ కితాబు ఇచ్చింది.

ఈ చట్టంతో భూమిపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయని ..రైతుల భూములు లాక్కునే పరిస్థితి అస్సలే ఉండదని క్లారిటీ ఇచ్చింది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. ఆర్టీఐ ద్వారా వెంకటేశ్ వేసిన అప్లికేషన్ మేరకు నీతి ఆయోగ్ ఈ సమాచారం వెల్లడించింది.

ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే భూ పరిపాలన మరింతగా సులువు అవుతుందని తెలిపింది నీతి అయోగ్. పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం అని నీతి ఆయోగ్ ప్రకటించింది. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి నీతి ఆయోగ్ చెక్ పెట్టినట్లు అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -