Sunday, May 4, 2025
- Advertisement -

పార్టీ ఫిరాయింపు..ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు

- Advertisement -

పార్టీ ఫిరాయింపులను పాల్పడిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది. వైసీపీ నుండి టీడీపీ,జనసేనలో చేరిన ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్‌లపై అనర్హత వేటు వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ తెలిపారు. వైసీపీ తరపున ఎమ్మెల్సీలుగా గెలిచి టీడీపీలో చేరడంపై దాఖలైన అనర్హత పిటిషన్లపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు మండలి ఛైర్మన్.

వీరిద్దరిపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటు వేశారు. ఇద్దరు సభ్యులను వివరణ తీసుకున్న తర్వాతే వారిపై వేటు వేసినట్లు మండలి ఛైర్మన్ కార్యాలయం వెల్లడించింది.

వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరగా రామచంద్రయ్య టీడీపీలో చేరారు. వీరిద్దరూ ఇచ్చిన వివరణలతో సంతృప్తి చెందకపోవడంతో వారిపై అనర్హత వేటు వేసినట్టు ఛైర్మన్ మోషేన్ రాజు స్పష్టం చేశారు. వీరిద్దరి వేటుతో ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు పదవి కొల్పోయారు. ఇక ఎమ్మెల్యేల విషయానికొస్తే వైసీపీకి చెందిన నలుగురితో పాటు టీడీపీకి చెందిన నలుగురు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -