Friday, May 2, 2025
- Advertisement -

పవన్ కళ్యాణ్ వల్ల కూడా కాలేదు!

- Advertisement -

స్టార్ హోదా సమాజంలో అంతా గుర్తించడానికి ఉపయోగపడుతుందేమో కానీ రాజకీయాల్లో మాత్రం ఖచ్చితంగా లక్‌ ఉండి తీరాల్సిందే. లక్ లేకపోతే ఎంత ఫేమ్ ఉన్నా, అధికారంలో ఉన్నా సరే తమవారికి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వర్తిస్తుంది. ఎందుకంటే తన అన్నయ్య నాగబాబుకు పదవి ఇప్పించడంలో పవన్ ఫెయిల్ అయ్యారనే టాక్ నడుస్తోంది.

వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీటును ఆశీంచారు నాగబాబు. అయితే పొత్తులు, రాజకీయ సమీకరణల నేపథ్యంలో మెగాబ్రదర్ త్యాగం చేసి పవన్ తరపున ప్రచారానికే పరిమితవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ఛైర్మన్ పదవి నాగబాబుకేనంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ తీరా ఆ పదవి దక్కలేదు.

తర్వాత ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఇప్పుడు కూడా నాగబాబు పేరే వినిపించింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వ ఏర్పాటులో జనసేనాని పవన్ పాత్ర కీలకం. టీడీపీ – బీజేపీని జతకట్టేలా చేయడమే కాదు పరిమిత సంఖ్యలో పోటీ చేయాల్సి వచ్చినా సర్దుకుపోయారు పవన్. దీంతో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జనసేనకు ప్రాధాన్యం ఉంటుందని అంతా భావించినా అది మెగాబ్రదర్ విషయంలో మాత్రం సీన్ రివర్స్‌లా తయారైంది.

మూడు స్థానాల్లో ఒకటి బీజేపీకి, రెండు టీడీపీకి దక్కాయి. అయితే నాగబాబుకు రాజ్యసభ సీటు కోసం ఏకంగా ఢిల్లీకి వెళ్లి మరి ప్రయత్నాలు చేశారు పవన్. కానీ బీజేపీ పెద్దలు ససేమీరా అనడంతో చేసేదేమి లేక ఉత్త చేతులతోనే వెనక్కి రావాల్సి వచ్చింది. అయితే భవిష్యత్‌లో నాగబాబుకు ఖచ్చితంగా ప్రాధాన్యం దక్కుతుందని జనసేన నేతులు చెబుతున్నా నాగబాబుకు అప్పుడైనా అదృష్టం కలిసి వస్తుందా అన్న చర్చ మాత్రం జోరుగా జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -