- Advertisement -
నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో కడప కోర్టు బెయిల్ ఇచ్చింది.పోలీసులు దాఖలు చేసిన పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది.
ఓబులవారిపల్లి పీఎస్‌లో నమోదైన కేసులో పోసాని తరుఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. బెయిల్ లభించడంతో పోసానికి ఊరట లభించినట్లైంది.
ఆయనపై చిత్తూరు, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం పోలీసులను గురువారం ఆదేశించింది. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదుల ఆధారంగా 16 కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లను దూషించారంటూ ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణులు ఫిర్యాదులు చేయడంతో ఈ కేసులు నమోదయ్యాయి.