- Advertisement -
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రేవంత్ నివాసంలో మర్యాదపూర్వకంగా ఆయన్ని కలిశారు బాలకృష్ణ. తన చిన్న అల్లుడు భరత్‌తో కలిసి రేవంత్ రెడ్డిని కలవగా ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఈ భేటీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు బసవతారకం ఇండో-అమెరికన్ మెడికల్ హాస్పిటల్ సభ్యులు, ట్రస్టీలు కూడా ఉన్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి రాజకీయాలు చర్చకు రానట్లు తెలుస్తోంది. ఐదేళ్ల పాటు పాలన విజయవంతం కావాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. ఇక వీరిద్దరి భేటీ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే సినీ రంగానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున దంపతులు కలిసిన సంగతి తెలిసిందే.