Sunday, May 4, 2025
- Advertisement -

హిందూపుర్‌లో బాలయ్యకు భంగపాటేనా!

- Advertisement -

హిందూపుర్ టీడీపీ కంచుకోట. సీనియన్ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయుడు హరికృష్ణ సైతం ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014,2019లో నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఈసారి కూడా హిందూపుర్ బరిలో బాలయ్య నిలవగా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే రెబల్స్ ట్రబుల్ బాలయ్యపై స్పష్టంగా కనిపిస్తోంది.
బాలకృష్ణకు శ్రీపీఠం పీఠాధిపతి, బీజేపీ నేత పరిపూర్ణానంద వణుకు పుట్టిస్తున్నారు.

హిందూపురం అసెంబ్లీతోపాటు, లోక్‌సభ సీటు నుంచి పోటీ చేస్తున్న పరిపూర్ణానంద హిందూ ఓట్లను చీల్చితే.. బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల మైనార్టీ ఓట్లు వైసీపీకి ఖచ్చితంగా ప్లస్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. దీంతో బాలయ్యలో టెన్షన్‌ నెలకొందని ఆ పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి నెలకొంది.

వాస్తవానికి హిందూపుర్ సీటు పొత్తులో భాగంగా బీజేపీ తరపున తనకే దక్కుతుందని భావించారు పరిపూర్ణ. ఇందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ తీరా ఈ సీటు టీడీపీ సిట్టింగ్ స్థానం కావడం, అది బాలయ్య పోటీ చేస్తుండటంతో పరిపూర్ణకు నిరాశే ఎదురైంది. అయితే వెనక్కి తగ్గని ఆయన ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయగా బాలయ్యకు నిద్రలేకుండా చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -