బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులకు సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని, కేటీఆర్ పేరును ఎక్కడా వాడలేదని అన్నారు. వారంలోగా నోటీసులు వెనక్కి తీసుకోకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
పొలిటికల్ విమర్శలపై నోటీసులు సరికాదని..లీగల్ నోటీసులకు భయపడేది లేదని, తక్షణం ఆరోపణలను కేటీఆర్ వెనక్కు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తం 15 అంశాలతో కూడినటువంటి రిప్లయ్ నోటీసును కేటీఆర్ కు బండి సంజయ్ తరపు న్యాయవాదులు పంపించారు.
బండి సంజయ్ కామెంట్స్ తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని కేటీఆర్…సంజయ్‌కు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తనపై చేసిన ఆరోపణలు వారం రోజుల్లో వెనక్కు తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ పేర్కొన్నారు. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే కేటీఆర్ ఆరోపణలకు అప్పుడే కౌంటర్ ఇచ్చారు సంజయ్. రాజకీయంగా ఎదుర్కోలేక లీగల్ నోటీసులా అంటూ మండిడిన సంగతి తెలిసిందే.