Saturday, May 3, 2025
- Advertisement -

తోకముడిచిన టీడీపీ నేతలు!

- Advertisement -

టీటీడీ గోశాలలో ఆవుల మృత్యుఘోషపై టీడీపీ దుష్ట రాజకీయాలకు తెరలేపింది. ఈ నేపథ్యంలో నిజాలు నిరూపించాలని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సవాల్ విసిరారు వైసీపీ నేత,టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సవాల్‌కు స్పందించి వెళ్ళేందుకు సిద్దమైతే పోలీసులతో అడ్డుకున్నారు… గోమరణాలను నిరూపిస్తామనే భయంతోనే గృహనిర్భందం చేశారని దుయ్యబట్టారు.

సవాల్ చేసిన టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తోకముడిచారు… టీడీపీ ఎమ్మెల్యేలతో ఫోన్‌లో గోశాలకు రావాలంటూ కవ్వించారు అని దుయ్యబట్టారు. కనీసం అయిదుగురినైనా పంపాలన్నా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అంగీకరించలేదు… జిల్లా ఎస్పీతో అబద్దాలు చెప్పించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాలలో ఏడాదిలో 191 గోవులు మరణించాయని టీటీడీ అంగీకరించిందని… ఒక్క గోవు కూడా చనిపోలేదని సీఎం చంద్రబాబు ఎలా చెబుతారన్నారు.

22 ముసలి గోవులు మాత్రమే మరణించాయని టీటీడీ ఛైర్మన్ చెబుతారు… 43 గోవులు చనిపోయాయన్న టీటీడీ ఈఓ చెబుతారు… వారు చెబుతున్న సంఖ్య కన్నా ఎక్కువగానే గోవులు మృతి చెందాయి అన్నారు. జిల్లా ఎస్పీ మధ్యవర్తిత్వం వహిస్తే టీడీపీ వారి సమక్షంలోనే నిరూపిస్తాను అని తేల్చిచెప్పారు.

పోలీసులు మమ్మల్ని నిర్భందించడం వల్ల రాలేకపోతున్నామని బదులిస్తే, దానిని సదరు ఎమ్మెల్యేలు మీ పక్కన ఒక్క పోలీస్ కూడా లేరు, మీరు కావాలనే అబద్దాలు చెబుతున్నారంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. మీరు మాట్లాడేది తప్పు, మా చుట్టూ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మీరు మాకు ఎస్కార్ట్ ఇప్పించనట్లయితే నిజాలను మీకు చూపించేందుకు సిద్దంగా ఉన్నామని వారికి చెప్పడం జరిగింది అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -