Saturday, May 3, 2025
- Advertisement -

టీటీడీ గోశాల కాదు గోవధశాల!

- Advertisement -

టీటీడీ గోశాల కాదు అది గోవధ శాల అని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. మీడియాతో మాట్లాడిన భూమన.. మూడు నెలల్లో వందకు పైగా గోవులు మృత్యువాత పడ్డాయని… ఈ విషయం బయటకు రానివ్వకుండా టీటీడీ దాచిపెట్టిందని దుయ్యబట్టారు. గోధర్మం కాపాడలేని వారు…గోవిందుని ధర్మం కాపాడగలరా? చెప్పాలని డిమాండ్ చేశారు.

పవిత్ర క్షేత్రంలో గోవులను వథ్యశిలకు బలిచేస్తున్నారు.. గోవుల అనుమానాస్పద మృతిపై పోస్ట్‌మార్టం ఎందుకు చేయించలేదు? చెప్పాలన్నారు. హిందూధర్మ పరిరక్షణ సంఘాలు ఈ ఘాతుకంపై స్పందించాలి అని డిమాండ్ చేశారు భూమన.

గోవులకు తిరుమల క్షేత్రంలో ఎటువంటి దుస్థితి దాపురించిందో ప్రజలకు తెలియచేసేందుకు ఈ మీడియా సమావేశంలో వాటి దుస్థితికి అద్దం పట్టే ఫోటోలను ప్రదర్శిస్తున్నాం అన్నారు. దేశవాళీ అవులు ఎంత దారుణంగా మృత్యువాత పడ్డాయి, వాటిని ఏ రకంగా టీటీడీ గోశాల నిర్వాహకులు వదిలేశారనే దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఈ మీడియా సమావేశంలో మొత్తం ప్రజలంతా చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం అన్నారు.

టీటీడీ గోశాల నుంచి నిత్యం వంద కేజీల స్వచ్ఛమైన నెయ్యిని స్వామివారికి అందించాలనే లక్ష్యంతోనే వైసీపీ ప్రభుత్వం ఈ గోశాలలో మేలుజాతి దేశీయ ఆవులను తీసుకువచ్చింది. ఈ ఆవుల నుంచి వచ్చే పాలను కూడా సంప్రదాయ కవ్వంతో చిలికి, దాని ద్వారా వెన్నను తీసేలా జాగ్రత్తలు తీసుకున్నాం అని గుర్తుచేశారు. శ్రీవారి పట్ల, పవిత్రమైన గోవుల పట్ల వైయస్ జగన్ కి ఉన్న చిత్తశుద్ది అది…నిపుణులతో గోవును ఎలా రక్షించుకోవాలనే దానిపై సదస్సులను నిర్వహించాం అన్నారు. గోమూత్రం, గోమయంతో సుగంధ ద్రవ్యాలను తయారు చేశాం. వాటిని భక్తులకు విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించి, గోశాల కోసం వినియోగించాం అని తెలిపారు. టీటీడీ గోశాలలో గోమాత పట్ల జరుగుతున్న పాపంకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సనాతన ధర్మపరిరక్షణకు కంకణం కట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బదులు చెప్పాలి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -