ఇవాళ సీఎం జగన్ తిరుమలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు పోలీసులు. తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. నేటి నుండి నెల రోజుల పాటు తిరుమల వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు.
దీనిని తీవ్రంగా ఖండించారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆలయాలకు ఎవరు వచ్చినా సాదర స్వాగతం పలుకుతుంది హిందూ ధర్మం. అలాంటిది.. ఐదేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేతను అడ్డుకోవాలని చూస్తారా? అని మండిపడ్డారు. జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేయవద్దని హితవు పలికారు భూమన.
జగన్ అంటే చంద్రబాబుకు ఎంత భయమో దీని బట్టి చూస్తే అర్థమవుతోందన్నారు భూమన. వైఎస్ జగన్‌పై నీచాతినీచంగా రాజకీయ దాడికి దిగుతున్నారు… దేవుడిపై భక్తి లేని వారు జగన్‌ను కట్టడి చేయాలని చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదమూర్తి ప్రసాదం మీద వెయ్యి నాలుకలతో మాట్లాడకండని…. చంద్రబాబు మీరు చాలా పాపం చేశారు అన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణల నేపథ్యంలో తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకుగానూ.. ఆ పాప ప్రక్షాళన కోసం సెప్టెంబర్ 28న ప్రత్యేక పూజలు నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.