Sunday, May 4, 2025
- Advertisement -

సనాతన ధర్మం బ్రాండ్‌…పవన్ స్పందిస్తారా!

- Advertisement -

సనాతన ధర్మానికి తానేదో బ్రాండ్ అని ఫీలవుతుంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ అదే కూటమి ప్రభుత్వంలో సనాతన ధర్మంపై కుట్ర జరుగుతుంటే మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన…సనాతన ధర్మంకు విఘాతం కలిగితే తాను ముందు ఉంటానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

తిరుమలలో ఓ ప్రైవేట్‌ హోటల్‌కు అనుమతులివ్వడంపై హిందూ సంఘాలు పోరాటం చేస్తున్నా.. పవన్‌ మౌనంగా ఉండడంపై భూమన మండిపడ్డారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగింది ఆనాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు ముంతాజ్ హోటల్‌కు అనుమతులు ఇచ్చారో చెప్పాలన్నారు.

సనాతన ధర్మంకు విఘాతం కలిగిన ముందు ఉంటాను అని చెప్పిన పవన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చెప్పాలన్నారు. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్‌.. అది వ్యక్తిగతం, రాజకీయాలతో సంబంధం లేదని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఆ పర్యటనల్లో రాజకీయ విమర్శలు ఎలా చేస్తారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేరళాకు వెళ్లి తిరుమల లడ్డూ గురించి తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు. లడ్డూలో కాదు.. కల్తీ మీ బుర్రలో జరిగింది. సౌరవ్ బోరా అనే ప్రస్తుత పాలక మండలి సభ్యుడు రూ. 30 లక్షలు ఖర్చు చేసి లక్ష లడ్డూలు తయారు చేయించారు. ఇప్పుడు ఆయన్ని కూడా అరెస్టు చేయించండని డిమాండ్ చేశారు భూమన.

పవన్‌ ఒకప్పుడు సూడో హిందువును, నేను బాప్టిజం తీసుకున్నా అన్నారు. తన భార్య క్రిస్టియన్ , పిల్లలు క్రిస్టియన్ అన్నారు. ఆపై కాషాయం కట్టి సనాతన ధర్మం అంటూ ఊగిపోయారు…ఆ ముసుగులోనే తిరుమల పవిత్రతను పవన్‌ దిగజార్చుతున్నారు అని భూమన మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -