సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై పలు కేసులు నమోదు కాగా ఆయన కోసం పోలీసులు వెతుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు రాంగోపాల్ వర్మ . సోమవారం వరకు వర్మను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆర్జీవీకి బిగ్ రిలీఫ్ లభించింది.
అనంతరం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో తనపై కేసులు నమోదు కావడంతో.. వర్మ హైకోర్టును ఆశ్రయించారు.
ఇక పోలీసుల సెర్చింగ్ నేపథ్యంలో వర్మ వీడియోను రిలీజ్ చేస్తూ సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉన్నానని, నిర్మాతలకు నష్టం కావొద్దనే విచారణకు హాజరు కావడం లేదని తెలిపారు. అంతేగాదు ఏడాది క్రితం పోస్టులు పెడితే ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటని ఎదురు ప్రశ్నించారు. పోస్టులు పెట్టిన వ్యక్తుల మనోభావాలు కాకుండా వేరే వ్యక్తుల మనోభావాలు దెబ్బతినడం ఏంటో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.