- Advertisement -
వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగర్జునకు హైకోర్టులో రిలీఫ్ దక్కింది. నాగార్జునపై ఓ మహిళ పెట్టిన కేసును హైకోర్టు క్వాష్ చేసింది. . తనకు ఉద్యోగం, కాంట్రాక్టులు ఇప్పిస్తానని లక్షల్లో నగదు తీసుకోవడంతో పాటు శారీరకంగా వాడుకున్నాడని .. పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ నాగార్జునపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ తర్వాత ఫిర్యాదు చేసిన మహిళతో రాజీ చేసుకున్నారు. తాను పొరపాటున మాజీ మంత్రిపై కేసు పెట్టానని ఉపసంహరించుకుంటానని తెలిపారు. హైకోర్టు రెండు, మూడు సార్లు విచారణ జరిపినా ఆ మహిళ .. కేసు ఉపసంహరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు. దీంతో నాగార్జునకు బిగ్ రిలీఫ్ దక్కినట్లైంది.