Sunday, May 4, 2025
- Advertisement -

వైసీపీ నేత సజ్జలకు బిగ్ రిలీఫ్

- Advertisement -

వైసీపీ కీలక నేత సజ్జలకు బిగ్ రిలీఫ్ లభించింది. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఓబుళవారిపల్లె పోలీసులు వీరి అరెస్ట్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఈ అభ్యర్థనను పరిశీలించి, రూ. 10 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని, విచారణకు సహకరించాలని ఆదేశించింది.

ఓబుళవారిపల్లె పోలీసులు సజ్జల, భార్గవరెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఈ కేసు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. హైకోర్టులో వారికి ముందస్తు బెయిల్ మంజూరవ్వడం రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది.

సజ్జల, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్ లభించినా, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని న్యాయవర్గాలు స్పష్టం చేశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -