వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసుల్లో సెక్షన్లను చూసి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
గౌతమ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ జేబీ పార్దివాల, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డిపై కేసులో సెక్షన్లను చూసి ధర్మాసనం ఆశ్చర్యపోయింది. దాడి చేసిన వ్యక్తే బెయిల్‌పై ఉన్నప్పుడు కుట్ర చేశారన్న గౌతమ్‌రెడ్డిని విచారించాలి కదా?. ఈ కేసులో నిందితులంతా బెయిల్‌పైనే ఉన్నారు. ఈ కేసు మెరిట్‌లోకి వెళ్లడం లేదు అని తెలిపింది న్యాయస్థానం. గౌతమ్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.