లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిలీఫ్ లభించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తాత్కాలిక రిలీఫ్ ఇచ్చేలా తీర్పునిచ్చింది. మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు, తదుపరి విచారణ వరకు ఆయనను అరెస్టు చేయకూడదని ఆదేశించింది.
మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, మిథున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ జే.బి. పార్డీవాలా మరియు జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. అరెస్ట్ నుంచి తాత్కాలిక రిలీఫ్ ఇచ్చేలా అరెస్ట్ చేయకూడదని నోటీసులు జారీ చేసింది.
ఈ విచారణలో సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ మిథున్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో మద్యం విధానం కేసు ఇంకా ప్రారంభ దశలో ఉందని, అలాగే మిథున్ రెడ్డి ఇప్పటివరకు కేసులో నిందితుడిగా నమోదు కాలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే, అదే రోజు సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకోవడం, ఆయనను అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు రావడంతో, మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.