నిన్న గొల్లప్రోలులో అన్నాక్యాంటీన్ ప్రారంభోత్సవం.. నేడు కుమారపురంలో ఎమ్మెల్సీ నాగబాబుకు షాక్ తగిలింది. వర్మకు మద్దతుగా టీడీపీ నేతలు నినాదాలు చేస్తూ నాగబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభించారు ఎమ్మెల్సీ నాగబాబు. టీడీపీ, జనసైనికుల పోటా పోటీ నినాదాలు, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.
నాగబాబు పర్యటిస్తుండగా … జై వర్మ అంటూ టిడిపి వర్గీయులు పసుపు జెండాలతో నినాదాలు చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పిఠాపురంలో టిడిపి నియోజకవర్గ ఇంచార్జి ఎస్పీఎస్‌ఎన్ వర్మ తన సీటు త్యాగం చేసి మరీ పవన్ కల్యాణ్‌ను గెలిపించారని, అలాంటి వ్యక్తిని జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు తక్కువ చేసి మాట్లాడారని టిడిపి శ్రేణులు, వర్మ అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.