Monday, May 5, 2025
- Advertisement -

పేదలపై బీజేపీ నేతల కక్ష సాధింపు..దౌర్జన్యకాండ!

- Advertisement -

ఏపీలో కూటమి నేతల దాష్టికాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టీడీపీ నేతలతో పోటీ పడి మరి బీజేపీ నేతలు సైతం దౌర్జన్యకాండ ప్రదర్శిస్తున్నారు. తాజాగా నందిగామలో సామాన్యులపై బీజేపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లను కూల్చివేస్తామని బెదిరించి.. ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు బీజేపీ నేతలు. అంతేగాదు జగనన్న కాలనీలో నిరుపేదలకి ఇచ్చిన ఇళ్ల స్థలాలను ట్రాక్టర్‌తో దున్ని.. రోడ్లు, వాటర్ ట్యాంక్, పైప్‌లైన్‌ను ధ్వంసం చేశారు బీజేపీ నేతలు.

దీంతో పేదల కుటుంబాలు రోడ్డున పడగా ఇంకెన్నాళ్లు దౌర్జన్యం చేస్తారని అంతా ప్రశ్నిస్తున్నారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామానికి చెందిన కుంటుముద్ది వాసు అనే వ్యక్తికి వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల పట్టా మంజూరు అయింది.

భూ వివాదాలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో వాసు ఇల్లు కూడా కట్టుకున్నాడు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీజేపీ నాయకులు కాలనీలో రోడ్డు ధ్వంసం చేశారు. ఇంకో రెండు రోజుల్లో ఇల్లు కూడా పడేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేగాదు వాసుతో ఇల్లు కూడా ఖాళీ చేపించారు కాషాయ నేతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -